కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించడం అధికార పార్టీ దుర్వినియోగమే..
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తొలగించడం దారుణమని పీసీసీ ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందాన్ అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తొలగించడం దారుణమని పీసీసీ ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందాన్ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి 1200 మంది అమరులు అయ్యారని, 60 సంవత్సరాల పోరాటమని, దానిని చూసిన సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే వారికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తిసివేయటం సరైనది కాదని ఆయన అన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నమో దానిని అమలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మా నాయకులు రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నామన్నారు.
ఒక శాసనసభ్యుడు ప్రజలసమస్యలు తెలుసుకొని తీర్చాలని కానీ మీడియాలో కనపడాలని మాట్లాడవద్దని వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకోలేదని, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదని, ప్రజలు కష్టాలు అనుభవిస్తే పట్టించుకోకుండా ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకునే బాధ్యత అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే వుందని ఆయన అన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన రైల్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు, ఆ కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్థి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్ బిన్ హందాన్, ప్రసాద్, ఆశ్రఫ్ పాల్గొన్నారు.