అనంతగిరి కొండల్లో గతేడాది గందరగోళం.. ఈసారీ అదే రిపీట్ కానుందా?

నూతన సంవత్సర వేడుకల కోసం జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ చేశారు.

Update: 2024-12-31 03:23 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : నూతన సంవత్సర వేడుకల కోసం జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ చేశారు. వికారాబాద్, అనంతగిరి ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లతో పాటు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జరిగే వేడుకలకు అనుమతులు తప్పనిసరి అని ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాటించాల్సిన నియమ నిబంధనలతో పాటు సలహాలు సూచనలు కూడా జారీ చేశారు. రిసా ర్ట్స్, ఫామ్ హౌస్‌లలో అనుమతులు ఉంటేనే ఈవెంట్స్ నిర్వహించాలని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పరిధిలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని, అనంతగిరికి నేచర్ ఎంజాయ్ చేయడానికే రావాలని, అంతేగాని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్, కారు రేసింగ్‌లకు పా ల్పడి ఇబ్బందులు పడవద్దని ఎస్పీ నారాయణ రెడ్డి హెచ్చరించారు.

ఈసారైనా ట్రెండ్ మారుతుందా..?

గత ఏడాది నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రధానంగా అనంతగిరి ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న వివిధ రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లలో గందరగోళ పరిస్థితులు ఏర్ప డ్డాయి. అప్పటి ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో అనేక నియమ నిబంధనలు జారీ అయినప్పటికీ ఏ ఒక్కరూ వాటిని పాటించలేదని అనేక సంఘటనలు కళ్లకు కట్టినట్లు చూపిం చాయి. చట్టవిరుద్ధంగా కొందరు రిసార్ట్స్ నిర్వాహకులు డీజేలు, సీజ ర్ లైట్లతో ఈవెంట్లు నిర్వహించి నానా హంగామా చేశారు. కొన్ని రిసార్ట్స్‌లలో మద్యం మత్తులో గొడ వలు కూడా జరిగాయి. సీజర్ లైట్లు డీజే పాటలతో అనంతగిరి ఫారెస్ట్ మారుమ్రోగడంతో, పెద్ద పెద్ద శబ్దా లకు రోడ్డుపైకి వచ్చిన వన్యప్రాణులు మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వేడుకల రోజు ఒక జింక మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.

మరికొందరైతే చట్టవిరుద్ధంగా మైనర్ జంటలను కూడా అనుమతించి అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇంత హంగామా జరిగి నా కేసులు మాత్రంగానే జరిగాయనే విమర్శలున్నాయి. నాటి ఎస్పీ కోటిరెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నా కింది స్థాయి అధికారులు కొన్ని విషయాలు బయటకు రాకుండా చూసుకున్నారని ఆరోపణలున్నాయి. ఇది ప్రతి ఏడాది జరిగేదే అని జిల్లాలో చర్చ కొనసాగుతోంది. పోలీస్ శాఖ నిబంధనలు పెట్టినా వాటిని ఏ రిసార్ట్స్ నిర్వాహకులు పాటించరని, కేవలం ఇది పేపర్లకే పరిమితం అవుతుందని చర్చ నడుస్తోంది. కనీసం ఈసారైనా గతంలో జరిగినట్లు కాకుండా ట్రెండ్ మారుతుందా..? అని జిల్లా ప్రజలు ఎస్పీ నారాయణ రెడ్డి పై పూర్తి ఆశలు పెట్టుకున్నారు.

ఎస్పీ సలహాలు, సూచనలు..

  • డీజే, సౌండ్ బాక్స్‌లకు, పెద్ద పెద్ద శబ్దాలకు ఎలాంటి అనుమతులు లేవు.
  • రిసార్ట్, ఫామ్ హౌస్ లపై ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. రిసార్ట్, ఫామ్ హౌస్ లలో ఎలాంటి ఆశీల్ల కార్యక్రమాలు జరపకూడదు.
  • మద్యం తాగి, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసినా, నియమ నిబంధలను పాటించకుండా వాహనాలు నడిపిన వారి వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటారు.
  • 31 డిసెంబర్ అర్ధరాత్రి సమయంలో నూతన సంవత్సరం వచ్చిన సందర్భంగా ఎవరూ రేసింగ్‌లు, బైక్ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదు.
  • 31న సాయంత్రం నుంచి నూతన సంవత్సరం ఉదయం సమయం వరకు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, వాహన తని ఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వాహనదారులు కచ్చితంగా వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలి.
  • నూతన సంవత్సరం సంర్భంగా జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పెట్రో లింగ్, బందో‌బస్త్‌లు ఏర్పాటు చేయనున్నారు.
  • పోలీస్ అధికారులు తెలిపిన విధులు నిర్వహించే సమయం ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఆ ఘటనలను వీడియోలు చిత్రీకరించి కేసు లు నమోదు చేస్తారు.
  • ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున చేస్తే వారు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి గా తీసుకొని, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు తెలిపిన నియమ నిబంధనలు కచ్చి తంగా పాటించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బందులు గురి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
  • పోలీసు శాఖ నుంచి వెలువడిన సూచనలు, సలహాలను అతిక్రమించిన వారిపై ప్రజా భద్రత రీత్యా చట్టపరమైన చర్యలను తీసుకుంటారు.

పై సూచనలు పాటించి జిల్లా ప్రజలు పోలీస్ అధికారులకు పూర్తిస్థాయిలో తమ సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ కోరారు. డిసెంబర్ 31న రాత్రి మద్యం మత్తులో వాహనాలపై యువకులు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు లోనై సంతోష కరమైన రోజును విషాదకరంగా చేసుకోవద్దని కోరారు. సంతోషకరంగా, సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలను తమ తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి జరుపుకోవాలి పేర్కొన్నారు. ప్రజలకు ఏమైనా శాంతిభద్రతల సమస్య ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడించారు.


Similar News