రాజీనామా చేయాలంటూ మరో TRS ఎమ్మెల్యేకు ఫోన్ కాల్... ఆడియో వైరల్

ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలతో వచ్చే పథకాలు, ఫండ్స్ తో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న...Call to Jukkal MLA Hanmanth Shinde and demond his Resignation

Update: 2022-11-22 11:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలతో వచ్చే పథకాలు, ఫండ్స్ తో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తంతు ముగిసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అసెగ తలుగుతునే ఉంది. మీరు పదవిలో ఉండి ఏం చేయ్యడంలేదు.. మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం మంత్రులు దత్తత తీసుకుని డెవెలప్ చేస్తారని ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరడం షరా మామూలు అయిపోయింది.


తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు రాజీనామా సెగ తాకింది. ఉమ్మడి జిల్లాలోని ఏకైక రిజర్వుడ్ నియోజకవర్గం అయిన జుక్కల్ ఎమ్మెల్యేను తన పదవికి రాజీనామా చేయాలని ఓ యువకుడు అడిగిన అడియో వైరల్ అయింది. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ ఎమ్మెల్యే షిండే తో ఫోన్ లో సంభాషిస్తూ రాజీనామా చేయాలని కోరారు. రాజీనామా చేయడంతో వచ్చే ఉప ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నాడు. రాజీనామా తర్వాత తాము భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు పేర్కొన్నారు. ఈ విషయం జుక్కల్ ప్రజలలో చర్చ అంశం అయింది. శ్రీకాంత్ అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే తాపిగా అతడి వివరాలను ఆరా తీశారు. తాను బిచ్కుంధలోనే ఉన్నాను అక్కడికి ఉదయం వస్తే మాట్లాడుదాం అని సమాధానం ఇచ్చారు.

Read more:

1.గులాబీలో ''రైడ్స్'' గుబులు.. ముగ్గురు మంత్రులకు బిగుస్తోన్న ఉచ్చు.. ఇక నెక్ట్స్ ఎవరు?

Tags:    

Similar News