బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసన సెగ.. ఫ్లెక్సీ రూపంలో..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో నిరసన సెగ తగిలింది.

Update: 2023-11-20 16:32 GMT

దిశ, నందిపేట్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో నిరసన సెగ తగిలింది. ఈరోజు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగాసముద్ర గ్రామంలో పర్యటించగా.. ఫ్లెక్స్ రూపంలో గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ ఎక్కడ? మా ఊరిలో దళితులు లేరా దళిత బంధు ఎక్కడ? పేద కుటుంబాలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్ యాడికి బాయ్, మన ఊరు మన బడి అంటివి ఎక్కడ, డ్రైనేజీ సీసీ రోడ్లు ఎక్కడా? బడి పిల్లల ఉసురు పోసుకుంటివి, ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇక చేయరు అని గంగా సముద్ర గ్రామస్తులు ఫ్లెక్సీ రూపంలో నిరసన తెలియజేశారు. ఎన్నికలు వస్తేనే మా గ్రామం మీకు గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 'గో బ్యాక్' ఎమ్మెల్యే అంటూ నిరసన తెలియజేశారు.


Similar News