Arrested : ఎట్టకేలకు బైకు దొంగల అరెస్ట్.... రిమాండ్ కు తరలింపు
ఆరు నెలల కిందట పోయిన బైక్ దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నట్టు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం
దిశ, గాంధారి: ఆరు నెలల కిందట పోయిన బైక్ దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నట్టు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ ఫంక్షన్ లో గత ఆరు నెలల క్రితం మాతృ సంగెం కు చెందిన చాకలి విట్టల్ కళ్యాణ మండపంలో వివాహానికి బైక్ పైన వెళ్ళి కళ్యాణ మండపం ప్రాంగణంలో పార్క్ చేసిన బైకును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని ఫిర్యాదు రాగా కేసు నమోదు అయిందని తెలిపారు. నెల రోజుల క్రితం మాధవ పల్లి దగ్గర రోడ్డు పక్కనే తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వాహనానికి వెహికల్ తాళం చెవి పెట్టి వెళ్లగా ఆ బైక్ ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయగా కేసు నమోదైందని తెలిపారు.
అయితే నాలుగు రోజుల క్రితం తిమ్మాపూర్ గ్రామ శివారులో ధర్మ కంట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బాన్సువాడ నుండి గాంధారి వైపు వస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ లింగం అని చెప్పి,అతనితో పాటు అతని బంధువైన అదే కల్లూరు గ్రామానికి చెందిన సోలాపూర్ రాజు తో కలిసి మూడు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశానని ఒప్పుకోగా వాటిని వేరు వేరు ప్రాంతాల వద్ద స్వాధీన పరుచుకుని ఈరోజు నేరస్తులని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు.ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఏఎస్ఐ గంగారం ను కానిస్టేబులను ఎస్సై ఆంజనేయులు అభినందించారు.