Bhumi Puja : ఈ నెల 20న నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ

మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రూ. 2.11 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్వహించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భూమి పూజ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Update: 2024-08-14 03:39 GMT
Bhumi Puja : ఈ నెల 20న నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ
  • whatsapp icon

దిశ, నిజాంసాగర్: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రూ. 2.11 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్వహించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భూమి పూజ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు ఏడీఈ శ్రీనివాస్, రమణారెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ ఆలస్యం అయినందున పనులు చేపట్టేందుకు ఆలస్యం అన్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి చికోటి జయ ప్రదీప్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మల్లయ్య ఆకాష్, ఏఈ సివిల్ లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.


Similar News