అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలి..

అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య అన్నారు.

Update: 2023-02-14 13:13 GMT
అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలి..
  • whatsapp icon

దిశ, నిజామాబాద్ సిటీ : అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య అన్నారు. మంగళవారం పొడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా ఆదివాసి, గిరిజన, దళిత పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూముల నుండి బెదాఖలు చేయించే కుట్రను నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.

వ్యవసాయ రంగాన్ని పోడు భూములను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే యత్నం మోడీ సర్కార్ చేస్తుందని అన్నారు. పోడు సాగు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో వేలాది ఎకరాలు పార్టీ బీ లో ఉన్న రైతులకు కొత్త పాసు బుక్కులు ఇవ్వాలని రైతుబంధును అందజేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు. సిరికొండలోని 532 సర్వే నెంబరు, గడ్కోలు 100సర్వే నెంబర్లు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని, హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. మెంట్రాజ్ పల్లి 246 సర్వే నెంబర్లో పట్టాలు పొందిన వారికి ఆటంకాలు చేస్తున్నారని, పాస్ బుక్కులు వెంటనే ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు.

ధరణి పోర్టులో అనేక అవకతవకలు ఉన్నందున రద్దు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దేవస్వామి పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాయి రెడ్డి, ఏఐకేఎంఎస్ నాయకులు చిన్నయ్య, గోపాల్, రాగుట్ట బాబురావు, బి.సాయిలు, గంగాధర్ ఏ.చిన్నయ్య, బుచ్చన్న ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News