తిరుమల డిక్లరేషన్ వ్యవహారం.. వైఎస్ జగన్‌కు రఘునందన్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై వైఎస్ జగన్‌కు రఘునందన్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

Update: 2024-09-27 12:48 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల డిక్లరేషన్ వివాదం(Tirumala Declaration Controversy)పై వైఎస్ జగన్(Ys Jagan) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ తిరుమల వెళ్తానంటే బీజేపీ అడ్డుకోలేదని ఆయన తెలిపారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేక బీజేపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అన్యమతస్తులు దేవాలయాల్లోకి వెళితే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని రాజ్యాంగంలోనే ఉందని రఘునందన్ రావు గుర్తు చేశారు. మసీదులోకి వెళ్తే టోపీ, కర్చీఫ్ పెట్టుకుంటున్నారని, అలాంటప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలి కదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. 

కాగా  తిరుమల లడ్డూ వివాదం నడుస్తుండగా తిరుమల శ్రీవారినిని దర్శించుకోవాలని జగన్ భావించారు. ఈ మేరకు శుక్రవారం తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తిరుమల డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేయాలని శ్రీవారి భక్తులు, హిందువులు, పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. అసలు జగన్ ఏ మతం, ఏ కులమో చెప్పాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ వివాదంపై స్పందించిన జగన్ ... తన మతం మానవత్వమని, ఇంట్లో ఉంటే బైబిల్ చదువుతానని, బయట హిందు, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తానని, డిక్లరేషన్ రాసుకుంటే రాసుకోండని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.

Read More : జగన్‌పై భౌతిక దాడికి కుట్ర.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన ఆరోపణలు


Similar News