సింగరేణి చరిత్రలో రికార్డ్.. రూ.32,830 కోట్ల టర్నోవర్

సింగరేణి చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

Update: 2023-04-03 14:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సింగరేణి చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అంచనాలకు మించి రాణించి చరిత్రలోనే అత్యధికంగా రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో(మార్చి నెలలో) రూ.32,500 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్టు ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

రికార్డు స్థాయి టర్నోవర్‌ సాధించినందుకుగాను కార్మికులు, ఉద్యోగులను ఈ సందర్భంగా శ్రీధర్‌ అభినందించారు. అటు ఉత్పత్తిలోనూ సంస్థ రికార్డు నెలకొల్పిందని 2022-23లో 671 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని శ్రీధర్‌ పేర్కొన్నారు. ఇక గతేడాదిపై 23 శాతం వృద్ధి చెందామని, తెలంగాణకు ముందు ఏడాది టర్నోవర్‌తో పోల్చితే 174 శాతం వృద్ధి సాధించామని శ్రీధర్ వెల్లడించారు. 

Tags:    

Similar News