కిషన్ రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘తెలంగాణా రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Update: 2023-03-16 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘తెలంగాణా రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంత బిడ్డగా కేంద్రమంత్రిగా ఉన్నారు. కానీ, కేంద్రమంత్రిగా ఉన్న మీరు ఆ బాధ్యతలు మరిచి అడ్డగోలు చిల్లర విమర్శలకే పరిమితమయ్యారు తప్ప ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలకోసం పనిచేయలేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయాసినట్టుగానే నేడు కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణాకు ఒక్క రూపాయినికి కూడా తేలేక ఒక అసమర్థుడిగా మిగిలిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిదులిస్తుంటే పట్టించుకోకుండా సిగ్గులేకుండా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం వరదల సమయంలో రూ.1000 కోట్ల సహాయాన్ని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో భారీ వర్షాలతో వరదలొస్తే బండి పోతే బండి ఇస్తాం అంటూ డంబాచారాలు పలికి అర్థరూపాయి సాయం కూడా చేయలేకపోయారు.. తెలంగాణ ప్రభుత్వమే వారిని ఆదుకుంది.. వరంగల్ జిల్లాలో గత ఏడాది జనవరిలో వడగల్ల వాన సృష్టించిన విధ్వంసానికి రైతులు తీవ్రంగా నష్టపోతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి నష్టపోయిన రైతులకు ఇన్ పుడ్ సబ్సిడి అందించి ఆదుకుంది.. తెలంగాణా నుండి ప్రాతినిధ్యం వహుస్తున్న మీరు మాత్రం అర్థరూపాయి సాయం చేయకపోగా కనీసం ఇటువైపు చూడనూ లేదు.. తెలంగాణకు ప్రతీ విషయంలో మొండిచెయ్యి చూపుతారు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మరియు ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రం అడక్కుండానే నిదులు ఇస్తూ మీ ప్రభుత్వం వక్రబుద్దిని చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరదసాయం అడిగితే మొండి చేయి చూపించిన మోదీ సర్కారు’’ అని కిషన్ రెడ్డికి పంపిన లేఖలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News