రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

ప్రభుత్వం రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం పేరిట సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయం నుంచి ప్రారంభించారు.

Update: 2024-03-06 15:37 GMT

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): ప్రభుత్వం రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం పేరిట సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదట నియోజకవర్గానికి మోడల్‌గా ఒకటి చొప్పున అధికారులు ఎంచుకున్నారు. దానిలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పాలకవీడు మండలంలోని గుడుగుంట్ల పాలెం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలను ప్రారంభించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆన్‌లైన్‌‌లో శిక్షణ ద్వారా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల మధ్య ప్రత్యక్ష, పరస్పర విషయ మార్పిడికి సులబ మార్గంగా రైతువేదికలు నిలవనున్నాయి. శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులతో క్షేత్రస్థాయి సమస్యలపై ముఖాముఖిగా చర్చించడానికి వీలు కలుగుతుందని.

రైతు వేదికల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం రైతులకు నేరుగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారు. వ్యవసాయంతో పాటు ఇతర శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు అనుకూలంగా ఈ రైతు వేదికలు వేదికగా కానున్నాయి. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ డివిజన్ వ్యవసాయ అధికారి సంధ్యారాణి ఎంపీపీ గోపాల్ మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్ మండల వ్యవసాయ అధికారులు బి.శ్రీనివాస్ , ప్రియతం కుమార్‌, జావీద్ పాలకవీడు ఎంపీడీఓ లక్ష్మి , హార్టికల్చర్ ఆఫీసర్ అనిత ఎంపీఓ దయాకర్, వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్ ఎంపీటీసీ మీసాల ఉపేందర్ దొంగల వెంకటయ్య మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తీగల శేషి రెడ్డి ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.


Similar News