రేపు తాగునీటి అవసరాల కోసం... సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

తాగునీటి ఇక్కట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది.

Update: 2024-03-08 13:26 GMT

దిశ, నాగార్జునసాగర్: తాగునీటి ఇక్కట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. అందుకోసం సాగర్‌ డ్యాం నుంచి ఎడమ కాలువకు తాగు నీటి అవసరాల నిమిత్తం కృష్ణా నది యాజమాన్య బోర్డు అధికారులు రేపు ఉదయం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రేపటి నుంచి పది రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


Similar News