United Teachers Federation : బదిలీల్లో రిలీవ్ కాని వారిని వెంటనే రిలీవ్ చేయాలి..
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో కొంతమంది రిలీవ్ కాలేదని ఈ మేరకు వారందరిని ఆయా స్థానాల నుండి వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నన్నే బోయిన సోమయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు.
దిశ, తుంగతుర్తి : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో కొంతమంది రిలీవ్ కాలేదని ఈ మేరకు వారందరిని ఆయా స్థానాల నుండి వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నన్నే బోయిన సోమయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. తుంగతుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక, వివిధ గురుకులాల్లో జరిగిన సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
పీఆర్సీని వెంటనే ప్రకటించడంతో పాటు పెండింగులో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసర ధరల కనుగుణంగా మధ్యాహ్న భోజన రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, తుంగతుర్తి మండల అధ్యక్షుడు మల్లెపాక రవీందర్, ప్రధాన కార్యదర్శి వేము రవీందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎడ్ల గోపయ్య, పాలకుర్తి ఎల్లయ్య, బొల్లెడ్డు విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.