స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు వన్నె తెచ్చిన మాజీ స్వీకర్, స్వర్గీయ నేత దుద్దిళ్ళ శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు చెప్పారు.
దిశ, సూర్యాపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు వన్నె తెచ్చిన మాజీ స్వీకర్, స్వర్గీయ నేత దుద్దిళ్ళ శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనాతో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్వర్గీయ శ్రీపాద రావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని, ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటిగా సర్పంచ్ గా రెండు సార్లు ఎన్నికై తదుపరి మహాదేవపూర్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారని చెప్పారు. 1984 ఎన్నికల్లో మొదటి సారి మంథని నుంచి శాసన సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించి 3 సార్లు శాసన సభ్యునిగా ఎన్నికైనట్లు తెలిపారు. 1994 లో ఓటమి పాలు అయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో సేవలు అందించడం అలాగే 1999 ఏప్రిల్ 13 న మహాదేవపూర్ మండలం అన్నారం వెళ్లి వచ్చే అటవీ మార్గంలో ఆయన మృత్యువు నక్సల్స్ రూపంలో విగత జీవిని చేసిందని ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. అధికారులు మహనీయుని గురించి కింది స్థాయి సిబ్బందికి కూడా తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఆర్డీఏ పిడి మధుసూదన్ రాజు, డీటీడీవో శంకర్, డీఈవో అశోక్, జియం ఇండస్ట్రీస్ సీతారాం, డీఎస్ఓ మోహన్ బాబు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.