Disha Effect : దిశ ఎఫెక్ట్.. క్షణాల్లో స్పందించిన జిల్లా కలెక్టర్..
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మాత శిశు సంరక్షణ కేంద్రంలో
దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మాత శిశు సంరక్షణ కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో నేరడుగొమ్ము గ్రామానికి చెందిన నల్లబెల్లి అశ్విని కుర్చీలో కూర్చొని ఒక పాపకు జన్మనిచ్చిన సంఘటన వార్తను దిశ ప్రచురించింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తక్షణం స్పందించి ఆస్పత్రిలో జరిగిన ఈ అమానుష సంఘటనకు కారకుల పై చర్యలు తీసుకోవాలని నల్గొండ జాయింట్ కలెక్టర్ పూర్ణ చంద్రకు విచారణ అప్పగించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న జేసీ.పూర్ణ చంద్ర అశ్విని ని ఆమె భర్త ఆంజనేయులు ని కలిసి జరిగిన సంఘటన మీద పూర్తి విచారణ చేశారు. లోతుగా విచారణ చేపట్టి కలెక్టర్ కి పూర్తి నివేదిక అందజేస్తామన్నారు. బాద్యుల మీద చర్యలు ఉంటాయని, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని మౌలిక వసతుల కల్పన తో పాటు పూర్తిగా ఇబ్బంది లేకుండా సిబ్బందిని తీసుకుంటున్నాం అన్నారు.నార్మల్ డెలివరీ అయ్యేలా ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.