బెల్లం పట్టిక వ్యాపారం చేసే వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకుంటాం
నాటు సారా కొరకు ఉపయోగించే బెల్లం పట్టిక తరలించే వ్యాపారులపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హుజుర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి వ్యాపారస్తులను హెచ్చరించారు.
దిశ, హుజుర్ నగర్: నాటు సారా కొరకు ఉపయోగించే బెల్లం పట్టిక తరలించే వ్యాపారులపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హుజుర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి వ్యాపారస్తులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి తెలంగాణకు 30 క్వింటాళ్ల బెల్లం ,50 కేజీల పట్టికను అశోక్ లేలాండ్ వాహనం పట్టుకొని ఆ వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. బెల్లంను సరఫరా చేసిన చిత్తూరుకు చెందిన బెల్లం వ్యాపారి దోమ నాగరాజు నాయుడుని అరెస్ట్ చేసేందుకు ఒక టీమ్‌ను పంపించి అతను అరెస్ట్ అయ్యేందుకు నిరాకరించగా చిత్తూరు పోలీసుల సహకారంతో అతన్ని అరెస్ట్ చేసి హుజుర్ నగర్ స్టేషన్‌కి తీసుకురావడం జరిగిందన్నారు. అతని పేరు మీద జిల్లాలోని వివిధ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని అతని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా అతని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ టీంలో ఎస్సైలు ఎక్సైజ్ ఎస్సైలు జగన్మోహన్ రెడ్డి వెంకన్న రవి, నాగరాజు, నరేష్‌లు పాల్గొన్నారు.