చిన్నారిపై వీధి కుక్క దాడి

చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. చింతపల్లి మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు తయారు చేసే సునీల్, పావని కుటుంబం చింతపల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటుంది.

Update: 2024-09-27 15:54 GMT

దిశ, చింతపల్లి : చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. చింతపల్లి మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు తయారు చేసే సునీల్, పావని కుటుంబం చింతపల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటుంది. వీరి రెండు సంవత్సరాల చిన్న కూతురు ఊర్మిళ ఆరు బయట ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడిచేసి గాయపరిచింది. దాంతో 18 కుట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చింతపల్లిలో కుక్కలు విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిపిల్లలను, పెద్దలను గాయపరుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News