Minister Uttam Kumar Reddy : శాలిగౌరారం ప్రాజెక్టుకు యాదగిరి రెడ్డి పేరు పెట్టాలి..

నల్లగొండ జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టులో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టుకు స్వాతంత్ర సమరయోధులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, స్వర్గీయ యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని శాలిగౌరారం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Update: 2024-08-11 11:35 GMT

దిశ, శాలిగౌరారం : నల్లగొండ జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టులో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టుకు స్వాతంత్ర సమరయోధులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, స్వర్గీయ యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని శాలిగౌరారం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి, ట్రస్టు కన్వీనర్ గోనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చామల వెంకట రమణారెడ్డి, నిరంజన్ రెడ్డి, గూని వెంకటయ్య, లోడింగి మహేష్, చందు, పడాల రమేష్ తదితరులు ఉన్నారు.


Similar News