రైతు నేస్తం " ఎంతో ఉపయోగపడుతుంది : కలెక్టర్ హనుమంత్ కె జండాగే
రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించడం కోసం రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి రాష్ట్రంలోని 110 రైతు వేదికలల్లో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
దిశ, వలిగొండ: రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించడం కోసం రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి రాష్ట్రంలోని 110 రైతు వేదికలల్లో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి బుధవారం వలిగొండ రైతు వేదికలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జడంగె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఉపయోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం "రైతు నేస్తం" కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులు దిగుబడి అధిక లాభాలు ఆర్జించే విధంగా అవగాహన కల్పిస్తారని, పంటల బీమా ద్వారా రైతులకు మొక్క నాటిన నాటి నుండి కోత కోసుకునే వరకు మధ్య కాలంలో ఏదైనా విపత్తు జరిగితే పెట్టుబడి అందుతుందని అన్నారు.
శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా సలహాలు తీసుకుని కొత్త పొగడాలు పద్ధతులు తెలుసుకొని తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం అర్జించే విధంగా ఉండాలని, ఎప్పటికప్పుడు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుని పంటలు పండించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని విధుల పట్ల అలసత్వం వై ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడిఏ దేవి సింగ్, తహసీల్దార్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఆజాద్ అలీ ఖాన్ ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.