రసాబాసాగా సర్వసభ్య సమావేశం

కోదాడ మండల పరిధిలోని యర్రవరం సహకార సంఘ సర్వసభ్య సమావేశం రసాబాసాగా నిర్వహించి మధ్యలోనే వాయిదా వేశారు.

Update: 2024-10-14 15:44 GMT

దిశ, కోదాడ:కోదాడ మండల పరిధిలోని యర్రవరం సహకార సంఘ సర్వసభ్య సమావేశం రసాబాసాగా నిర్వహించి మధ్యలోనే వాయిదా వేశారు. సోమవారం గ్రామం లోని పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో సహకార సంఘ సమావేశం..ఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. రైతులందరూ సంఘ చైర్మన్ అవినీతిని ఎండగడుతూ నిలదీశారు. సంఘ సభ్యులకు అనుమతి లేకుండా సిఈఓ ని బెదిరించి నాలుగు లక్షల రూపాయలు వాడుకోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరూ ఆందోళన చేస్తూ తక్షణమే చైర్మన్ తొలగించవలసిందిగా కోరుతూ ఎగ్జిక్యూటివ్ బాడీ కి విన్నపం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని సంఘంలోని తప్పులను సరిదిద్ది బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే పై అధికారులు స్పందించి చైర్మన్ ను డీఫాల్ట్ చేయాలని ఆందోళన చేశారు. ఆ క్రమంలో ఆందోళన ఉదృతం కావడంతో..పోలీసులు సమావేశం వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. 


Similar News