ఖిల్లా గుట్ట పార్కింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే

దేవరకొండ పట్టణంలోని 15,16,1,13 వార్డులలో మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పర్యటించి పాత బజార్ లో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించి,

Update: 2024-06-18 10:08 GMT

దిశ, దేవరకొండ టౌన్: దేవరకొండ పట్టణంలోని 15,16,1,13 వార్డులలో మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పర్యటించి పాత బజార్ లో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించి, పలు వార్డుల సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ వార్డు అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తూ, ప్రతి వార్డులో కావలసిన సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తదితర అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందన్నారు. వచ్చే నెల వరకు ఖిల్లా గుట్ట పార్కింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

మైనార్టీ షాది ఖాన పనులు చేపట్టాలి. షాది ఖాన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డ్రైనేజ్ వాటర్ STP వద్ద నీటిని శుద్ధి చేసి పట్టణ ప్రగతి పార్కులకు నీటిని వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహా, వైస్ చైర్మన్ రహత్ అలీ, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొర్ర రామ్ సింగ్ నాయక్, కౌన్సిలర్లు భూదేవి సైదులు, జయ ప్రకాష్, గాజుల మురళీ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News