కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన ప్రజలు..
తెలంగాణ రాష్ట్రం జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాధ ఉత్తమ కుమార్ రెడ్డికే ప్రజలు స్వాగతం పలికి పట్టం కట్టారు.
దిశ, నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్రం జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాధ ఉత్తమ కుమార్ రెడ్డికే ప్రజలు స్వాగతం పలికి పట్టం కట్టారు. ఈనెల 30 జరిగినా ఎన్నికలలో ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. హుజూర్ నగర్ వ్యాప్తంగా 308 బూతులకుగాను 18 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ ను సూర్యపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఎన్నికల ఫలితాలను లెక్కించారు.
మొదట రౌండ్ నుండి ఉత్తమే ఆధిక్యం..
ఎన్నికల ఫలితాలలో మొదటి రౌండ్ నుండి 18 రౌండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదిక్యతను కనబరిచారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 6456 రాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి 4169 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2287 మెజార్టీతో మొదలైన ఆయన ఆదిక్యం చివరి 18వ రౌండ్ ముగిసే సమయానికి ఉత్తంకుమార్ రెడ్డికి 1,15,320 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ 1366 ఆన్లైన్ సర్వీస్ ఓట్లు 21 కలిపి 116707 ఓట్లు పోలయ్యాయి. అలాగే ఉత్తమ్ కు సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 18 రౌండ్ ముగిసే సమయానికి శానంపూడి సైదిరెడ్డికి 71.361 ఓటు పోలయ్యాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ 446 ఆన్లైన్ సర్వీస్ ఓట్లు 12 కలిపి 71,819 ఓట్లు పోలయ్యాయి. అయితే ఎన్నికలలో సమీప ప్రత్యర్థి సైదిరెడ్డి కంటే ఉత్త కుమార్ రెడ్డి 44,888 మెజార్టీ సాధించి గెలుపొందారు.
18 రౌండ్లో కలిపి పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్లు..
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిలుట్ల రఘు 8280 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ పార్టీ అభ్యర్థి చల్ల శ్రీలత 3715 ఓట్లు సాధించి నాలుగు స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఏడీఆర్పీ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తిమ్మారెడ్డి 2333 ఓట్లు సీపీఎం పార్టీ అభ్యర్థి మల్లు లక్ష్మి 1914 బీఎస్పీ పార్టీ అభ్యర్థి రాపోలు నవీన్ కుమార్ 1481 డీఎస్పీ పార్టీ అభ్యర్థి అవిరెండ్ల జ్యోతి 370 టీఎస్పీ పార్టీ అభ్యర్థి జానయ్య నందిపాటికి 491, పీపీఐ పార్టీ అభ్యర్థి పిల్లలమర్రి లావణ్య 101, ఎంసీపీఐయూ అభ్యర్థి వసుకుల సైదమ్మకు 124 స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన చికూరి లీలావతికి 118, అంజనపల్లి రవి 849, బానోతు నాగేశ్వరరావు 134 , పిన్నెల్లి సంపత్ కుమార్ 164 పోతురాజు విజయ్ 1060, బండారు నాగరాజు 1269, బాదె నరసయ్య 142, డాక్టర్ మేడి రమణ 266, రవికుమార్ నాయక్ బి 410, రాంబాబు చిలక 1777, కర్నాటి వెంకటేశ్వర 381, మచ్చ సందీప్ 1046, డాక్టర్ దేశబోయిన సాంబశివ గౌడ్ 404, నోటాకు 843 ఓట్లు పోయాయి.