Municipal Chairman Burri Srinivas Reddy : జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం
నిత్యం విధి ఒత్తిడిలో ఉండి మానసిక ఇబ్బందులకు గురవుతున్న
దిశ, నల్లగొండ బ్యూరో : నిత్యం విధి ఒత్తిడిలో ఉండి మానసిక ఇబ్బందులకు గురవుతున్న జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ అటానమస్ ఆధ్వర్యంలో ఐకాన్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ ను అందరూ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వినియోగించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.
హైదరాబాద్ కు దీటుగా నల్లగొండలో అత్యధిక వైద్య సేవలు అందిస్తున్న ఐకాన్ హాస్పిటల్ కి ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్వహకులు కూడా సహకారం అన్నారు. ఐకాన్ హాస్పిటల్ ఎండి కోడే శశాంక్ మాట్లాడుతూ జర్నలిస్టుల అందరూ తమ హాస్పిటల్ సహకారంతో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీనియర్ డాక్టర్ల బృందం, అత్యాధునిక సాంకేతిక మెడికల్ ఎక్విప్ మెంట్ ద్వారా జర్నలిస్ట్ కుటుంబాలకు బీపీ, షుగర్, థైరాయిడ్, విష జ్వరాలు, కీళ్ళ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రో, యూరో, గుండె, వెన్నెముక, మెదడు, నరాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు ఉచిత టెస్టులు, మెడిసిన్ సలహాలు, సూచనలు సేవలందించనున్నామన్నారు.
నవంబర్ 15 వరకు జర్నలిస్ట్ ల కొరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు కొంత సమయం కేటాయించాలన్నారు. డాక్టర్లు గుండె వైద్య నిపుణులు డా. రవిశంకర్ కన్నా, నరాల వైద్య నిపుణులు డా.సాయి మౌనిక చెరుకూరి, గ్యాస్ట్రో వైద్య నిపుణులు వై శశింద్ర,మత్తు వైద్య నిపుణులు డా. కడిమి సాయి లావణ్య, ఎముకలు జిల్లా శస్త్రచికిత్స నిపుణులు డా.బచ్చు రాజేంద్రప్రసాద్,డా.ఎన్. సైదులు,డా.గంజి రాము, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్, సీనియర్ జర్నలిస్ట్ ఫహీం, టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్, జర్నలిస్టులు వెంకట్ రెడ్డి, హరిప్రసాద్, సల్వాది జానయ్య, మేకల రమేష్, భూపతి రాజు, మక్సూద్, ఎన్నమల్ల రమేష్ బాబు, దండంపల్లి రవికుమార్, ఉబ్బని సైదులు, చింత యాదగిరి, కత్తుల యాదగిరి, పెద్దగోని మధు, కట్ట యాదగిరి, జిల్లా రాజశేఖర్, చారి, శివ తదితరులు ఉన్నారు.