'అధికార అహంకారం వల్లనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు'
గత నెల 30న జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుబడడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేని ఎదురుదెబ్బ తగిలినది.
దిశ, దేవరకొండ : గత నెల 30న జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుబడడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేని ఎదురుదెబ్బ తగిలినది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, చాలామంది ఓటమి పాలయ్యారు. దానికి కారణం మంత్రులు, ఎమ్మెల్యేల అహంకార ధోరణితో పాటు బీఆర్ఎస్ అధినేత అన్ని అధికారాలు ఎమ్మెల్యేలకు ఇవ్వడం. దీంతో వారు ఆడిందే ఆటగా ! పాడిందే పాటగా ! అటు అధికారులను ఇటు నాయకులు పట్టించుకోకపోవడంతో ఈరోజు కారు పార్టీ వాళ్లకు ప్రజల్లో ఇమేజి పోయి ప్రజలు గుద్దిన గుద్దుకు కారు బొక్క బోర్ల పడింది. ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ 2014 లో సీపీఐ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలిచి, మళ్ళీ 2018లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ చరిస్మతో సునాయాసంగా సుమారుగా 38,848 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా నల్గొండ జిల్లాలోని చరిత్ర సృష్టించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఈ సారి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురికావడానికి కారణాలు ఆయన చేతులారా ఓటమిని చవిచూశారని తెలుస్తుంది.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారన్న గర్వంతో తనను ఎవరు ఓడించే అభ్యర్థి లేడంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరిని లెక్కచేయకుండా ఓడిపోవడానికి కారణమైనట్లు తెలుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రూపు తగాదాలను పెంచి పోషించి, పార్టీలో నమ్మకస్తులను సైతం చేజార్చుకున్నారు. అనే అపవాదు ఆయన పై ఉంది. దీంతో మొదట్నుంచి ఆయన పై పార్టీ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు నేరుగా సూచనలు చేస్తే వారి చేసే సలహాలను పట్టించుకునే పరిస్థితులు రవీంద్రకుమార్ కు లేకపోవడంతో ఓటమికి కారణమని తెలుస్తుంది.
కేవలం అభివృద్ధి పేరిట తన సొంత ఇంటి నుంచి నిధులు, సంక్షేమ పథకాలు, ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం ప్రజలంతా నా వైపే ఉన్నారనే భ్రమలో ఉండి నిద్ర మబ్బులో కూరుకుపోయారు. సంక్షేమ పథకాలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఆయా గ్రామాలకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, కానీ కేవలం నెలలో రెండు మూడు రోజులు క్యాంపు ఆఫీసుకు వచ్చి సీఎంఆర్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినంత మాత్రాన ప్రజలంతా తన వైపే ఉన్నారని విశ్వసించుకోవడం తను భ్రమలో ఉండి, ప్రభుత్వం పథకాలను ఎన్నికల చివరి సంవత్సరంలో సంక్షేమ పథకాలైన దళిత బంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్, లాంటి పథకాలు ఆయనను కోలుకోవాలని దెబ్బ కొట్టాయి.
పథకాల పేరుతో జనాన్ని కార్యకర్తలను పార్టీలో చేర్చుకొని ఆశల పల్లకి ఎక్కించారు. తనను ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఆ తర్వాత అన్నిపథకాలు మీ ముందుకు వస్తాయని కార్యకర్తలను నాయకులను నమ్మించారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పథకాలన్నీ కూడా ప్రజలకు అందకుండా కేవలం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మండల పార్టీ అధ్యక్షులు తాను సూచించిన వ్యక్తులకే అందించాడని అపవాదు చవిచూశాడు. కిందిస్థాయి నాయకులను విస్మరించి, మండల పార్టీ అధ్యక్షులకు మాత్రమే అధికారాలు ఇవ్వడంతో సర్పంచులు, ఎంపీటీసీలు, కొంత ఆసనానికి గురయ్యారు. దీంతో రెండవ స్థాయి నాయకులు ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో వ్యతిరేకించినప్పటికీ వ్యతిరేకతను సైతం మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే దృష్టికి తీసుక పోకపోవడం గమనార్హం.
గంటలకు కొద్ది క్యాంప్ కార్యాలయంలో ప్రజలు నిరీక్షించిన పట్టించుకోని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వివిధ పనుల నిమిత్తం ప్రజలు క్యాంపు కార్యాలయానికి వచ్చి గంటల కొద్దీ నిరీక్షించినప్పటికీ ఎమ్మెల్యే వారిని పట్టించుకోకపోవడంతో ఆయన పై నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు, రైతులు, సాధారణ ప్రజలు సైతం ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. ఈ విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు చీరలు అందిస్తామని ఆశ చూపి 11 గంటలకి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి సాయంత్రం నాలుగు గంటల వరకు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతర ప్రభుత్వ మహిళా అధికారులు పూర్తిగా నిరసించి ఎమ్మెల్యే ఆలస్యంగా రావడంతో తీవ్రంగా ఆయన పట్ల అసహనం వ్యక్తం చేశారు. అయినా అప్పుడు సైతం ఆయన వారిని పట్టించుకోకుండా ఆలస్యమైంది కొద్దిగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో మహిళలు సైతం ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడే వెళ్లిపోయారు.
క్యాంపు కార్యాలయం నుండి ఆయన ఎప్పుడు వచ్చిన పూర్తిగా ఆక్రోషంతో ఉండడంతో ఆయన కోసం ఎదురుచూస్తున్న నియోజకవర్గ ప్రజలు అధికారులు సైతం భయభ్రాంతులకు గురయ్యే వారిని, దీంతో అధికారులు ప్రజలు నాయకులు ఏదైనా పని విషయమై అడుగుతే ఆ సమయంలో తీవ్రమైన స్వరంతో ఆయన సంబోధించేవారని సమాచారం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే విధానం సరైంది కాదని ఎప్పుడు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన తమను ప్రజల లాగా చూసేవారు కాదని బానిసల్లాగా చూసే వాళ్ళని కొందరు నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ సందర్భం ఉంది. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రోటోకాల్ విషయంలోని తన ఇష్టారాజ్యంగా వివరించేవాడు.
జనహృదయాలలో చెరగని ముద్రవేసుకున్న బాలునాయక్..
జనం మెచ్చిన నాయకుడు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ స్వార్థం ఎరుగని నాయకుడిగా ముద్ర, పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు బాలునాయక్ రూటే సపరేటు, మాట ఇస్తే మడమ తిప్పని నైజం అన్ని వర్గాలకు సంచిత న్యాయమే ఆయన ముఖ్య ఉద్దేశం, పది సంవత్సరాలు అధికారం లేకున్నా కార్యకర్తలను కాపాడుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నైజం మడమ తిప్పని నికాసారైనా జనహృదయ నాయకుడు నేనావత్ బాలునాయక్ నా నుండి నేటి వరకు దేవరకొండ ప్రాంతంలో ఆయన పేరు బాగా వినిపిస్తుంది. జనం కోసం జనములో జీవించి తనదైన తరహాలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తల్లో మనోధైర్యాన్నిచ్చే నాయకుడిగా ఎప్పటి నుంచో ఆయనకు పేరు ఉంది. ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తూనే విజయం కోసం వేచి చూస్తే ఓర్పు సహనం ఆయనలో కొండంత ఉంది.
తనను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల కోసం అర్ధరాత్రి తలుపులు తెరిచే ఉంటాయని నా నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో బాలునాయకు పేరు ఉంది. రాజకీయాల్లో బలబలాలను అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి కులాల వారీగా మతాలవారీగా ఎన్నికల రణరంగంలో బాలు నాయక్ అనుచరులను బరిలోకి దించారంటే గెలడం ఖాయం అంటూ పలు మాలు రుజువు అయింది నమ్మిన పార్టీ సిద్ధాంతాల కోసం పాటుపడుతూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా తన భార్య కుటుంబ సభ్యులను. చూసుకుంటూ పార్టీకే తన జీవితం అంకితమై పని చేయడంలో 2009లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, 2018లో ఓడిపోయారు అనంతరం 2023లో తిరిగి ఎమ్మెల్యేగా ప్రజల ఆదర అభిమానాలు చూడగొని అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. విద్యార్థి సంఘం నాయకుడిగా యువజన సంఘం నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా, అంచలంచెలుగా పార్టీలో బలమైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడుగా తనదైన ముద్రవేసుకున్నాడు.
చందంపేట జెడ్పీటీసీగా కొనసాగిన రోజులు అద్భుతంగా నిధులను పరుగు పెట్టించారు.
బాలు నాయక్ అధికారంలో ఉంటే నిధుల వరద పరుగులు తీస్తుందని, పనులు వేగంగా జరుగుతాయని జటిలమైన పరిష్కారానికి నోచుకోని ఎన్నో పనులను శ్రీకారం చుట్టారని నా నుండి నేటి వరకు ప్రజల్లో ఉంది. వెనుకబడ్డ చందంపేట, నేరేడుగోమ్ములాంటి ప్రాంతాలకు నేడు బాలునాయక్ చేసిన అభివృద్ధి పనుల మార్క్ కనిపిస్తుంది. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పనులు చెప్పుకోవడానికి ఏవి లేవని గ్రామీణ ప్రజల సైతం బాహాటంగా చెబుతున్నారు.
బాలు నాయక్ సింపుల్ సిటీ మ్యాన్
బాలు నాయక్ సామాన్య సాధారణ జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కార్యకర్తల కుటుంబాలలో ఆయన కలిసిమెలిసి వెళ్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, సామాన్య పేద కార్యకర్త సైతం ఏ శుభకార్యానికి పిలిచిన హాజరై కార్యక్రమాలను సంతృప్తి పరచేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది. ఉన్నది పెడితే తిని వెళ్తానని తనకు హంగు ఆర్భాటాలు నచ్చవని పలుమార్లు ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయనంటే వినలేని అభిమానాన్ని ప్రజలు చురగొన్నారు.
కార్యకర్తలను అభిమానులను గుర్తించుకోను పేరు పెట్టి పిలిచే నైజం బాలునాయక్ కి సొంతం
ఆయన అవసరము ఉండి సాయం కోసం వచ్చే ప్రతి కార్యకర్తను, సానుభూతిపరులను, ప్రజలను ఒక్కసారిగా చూస్తే పేరు పెట్టి పిలిసే నైజం ఆయనది. సమస్యను విని పరిష్కరించే దిశగా ఆయన ఎన్నో మార్లు సక్సెస్ అయ్యారు. అన్యాయానికి గురైన ఎవరైనా ఆయనను ఆశ్రయిస్తే న్యాయపోరాటంలో ఆయన ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారని, కార్యకర్తలు ప్రజలు నమ్ముతారు. ఎన్నికల వరకే రాజకీయాల్లో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన సైతం ఆయన శత్రువును అతని విజ్ఞతకే వదిలేసే నైజం ఆయన సొంతం, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనే గెలుపోటములు సమానంగా స్వీకరిస్తానని ఇటువంటి గుణం కలిగిన వ్యక్తి బాలు నాయక్ అందుకే ఆయనకు దేవరకొండ నియోజకవర్గం ప్రజలు ఈనాడు 31,950 ఓట్ల మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.