నిరుపేద ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
దిశ, నకిరేకల్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సన్న బియ్యం తీసుకున్న నకిరేకల్ పట్టణానికి చెందిన లబ్ధిదారుడు వల్లాల సైదులు లక్ష్మమ్మ దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం భోజనం చేశారు.
ఎంతో ఆనందంగా సన్న బియ్యంతో వండిన భోజనం వారు వడ్డించడం, అదే సమయంలో వారి కళ్లలోని ఆనందం చూస్తుంటే జీవితం ధన్యమైంది అని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నిరుపేద ఇంట్లో సన్నబియ్యం భోజనం ఉండాలనే లక్ష్యంతోనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదే విధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వల్లాల సైదులు, లక్ష్మీ దంపతులు తమకు ఇల్లు లేదని ఎమ్మెల్యేకు విన్నవించగా వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.