తగ్గేదే లే... : ఎమ్మెల్యే చిరుమర్తి

ఆటంకాలు ఎన్ని ఎదురైనా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.... MLA Chirumarti Seriouce Opposition Parities Leaders

Update: 2023-02-14 11:20 GMT
తగ్గేదే లే... : ఎమ్మెల్యే చిరుమర్తి
  • whatsapp icon

దిశ, నకిరేకల్: ఆటంకాలు ఎన్ని ఎదురైనా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. దేశమంతా తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. రామన్నపేట మండలంలోని ఉత్తటూరు, ఇస్కిల్ల, జనంపల్లి గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ ఉత్తటూరు గ్రామానికి ఇప్పటికే రూ. 50 లక్షల వరకు నిధులు మంజూరు చేసినట్లుని ఆయన తెలిపారు. ఎల్లమ్మ గుడి నిర్మాణానికి సొంతంగా లక్ష రూపాయలు అందిస్తానని తెలిపారు. జనంపల్లి గ్రామంలో 12 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి చేస్తుంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కావాలని అభివృద్ధిని అడ్డుకుంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారని వారికి సరైన బుద్ధి తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి బలరాం, మండల పార్టీ అధ్యక్షులు మందడి ఉదయ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, జనంపల్లి సర్పంచ్ రేఖ యాదయ్య, ఎంపీటీసీ సభ్యులు వేమవరపు సుధీర్ బాబు, నాయకులు నక్క నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News