పల్లె పల్లెలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్‌కు ఓటేయండి : ఎమ్మెల్యే

తుంగతుర్తి నియోజకవర్గంలో పల్లె పల్లెలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కోరారు.

Update: 2023-11-13 15:31 GMT

దిశ, అడ్డ గూడూరు: తుంగతుర్తి నియోజకవర్గంలో పల్లె పల్లెలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కోరారు. సోమవారం మండలంలోని డిరేపాక , కంచనపల్లి , బొడ్డుగూడెం , చిర్రగూడూర్ , కోటమర్తి గ్రామాల్లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు నిర్విరామంగా తన ప్రచారాన్ని కొనసాగించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్‌కు ఓటేయాలని కోరారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సహాయం అందని కుటుంబం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయిల్ పెయిడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ధర్మేందర్ రెడ్డి , ఎంపీపీ దర్శనాల అంజయ్య, జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య , పీఎసీఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్ర నాథ్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News