రైతులందరికీ రుణాలు ఇవ్వాలి

రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, జాప్యం చేయొద్దని కలెక్టర్ తేజస్ నందులాల్ తెలిపారు.

Update: 2024-09-27 14:02 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, జాప్యం చేయొద్దని కలెక్టర్ తేజస్ నందులాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలలు బ్యాంకర్లు ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (24 -25) రూ.8994.16 కోట్ల రూపాయలను లక్ష్యంగా ఎంచుకోగా ఏప్రిల్ నుండి జూన్ వరకు రూ.2975.17 కోట్లను రుణాల రూపంలో ఇచ్చారని, 33.08 శాతం లక్ష్యాన్ని సాధించామని ఎల్డీఎం తెలిపారు. పీఎం సన్నిధి పథకంలో భాగంగా గడిచిన మూడు నెలల్లో 21,354 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 19389 మందికి మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు.

     పంట రుణాలకు గాను 2942.48 కోట్ల రూపాయలు రైతులకు అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 1058.87 కోట్ల రూపాయలు అందించారని వివరించారు. వ్యవసాయ రంగంలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 5625.92 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా రూ. 1951.68 కోట్లు అందించినట్టు తెలిపారు. భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 16 24.49 కోట్ల రూపాయలకు గాను రూ. 460.74 కోట్లు, ప్రాధాన్యత ఉన్న రంగాలకు రూ. 7570.66 కోట్లకు గాను రూ. 247.61 కోట్లు అందించినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రూ. 105.03 కోట్లకు గాను రూ. 120.66 కోట్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కన్వీనర్ ఎల్డీఎం బాపూజీ, ఆర్బీఐ ఏజీఎం శ్రీమతి గౌమతి, నాబార్డ్ జీఎం సత్యనారాయణ, డీఆర్డీఓ వీవీ అప్పారావు, సీపీఓ ఎల్. కిషన్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీసీఓ పద్మ ,ఇండస్ట్రియల్ అధికారి సీతారాం, పశుసంవర్థక శాఖ అధికారి శ్రీనివాస్, అన్ని బ్యాంకుల కంట్రోలర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News