Krishna water : తెగిన వరద కాలువ కట్ట.. వాగులో కలుస్తున్న కృష్ణా జలాలు..

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు వరద కాలువ 36.5 కిలోమీటర్ అనుముల మండలం మారేపల్లి గ్రామం వద్ద మంగళవారం ఉదయం కాల్వ కట్టకు భారీ గండిపడి కట్ట పూర్తిగా తెగిపోయింది.

Update: 2024-08-06 09:22 GMT

దిశ, హాలియా : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు వరద కాలువ 36.5 కిలోమీటర్ అనుముల మండలం మారేపల్లి గ్రామం వద్ద మంగళవారం ఉదయం కాల్వ కట్టకు భారీ గండిపడి కట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో కాల్వలోని కృష్ణా జలాలు హాలియా వాగులోకి వృధాగా పోతున్నాయి. వరద కాలువ కింద చెరువులను కుంటలను నింపేందుకు గత 2వ తేదీన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వరద కాలువకు నీటిని వదిలిన విషయం తెలిసిందే. కాగా వరద కాలువ కట్టలు బలహీనంగా ఉండడంతో కాల్వ పలుచోట్ల కోతకు గురవుతున్నాయి. మారేపల్లి గ్రామం హాలియా వాగు వద్ద సమీపంలో ఉన్న బ్యాంకింగ్ ఏరియాలో కాల్వకట్ట కోతకు గురైంది.

దీంతో కాలువలో ప్రవహిస్తున్న నీరు వృధాగా బంధం ద్వారా వాగులోకి చేరుతుంది. విషయం తెలుసుకున్న సాగునీటి అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నీటి వృధా ద్వారా టేలెండ్ ప్రాంతాల్లో ఉన్న చెరువులను కుంటలను నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికే నాన్ ఆయకట్టు కింద చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. సాగునీటి అధికారులు వెంటనే స్పందించి తెగిపోయిన కాలువ కట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News