Yadadri : యాదగిరిగుట్ట కొండపైన పుష్కరిణి ప్రారంభోత్సవం..
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఆదివారం విష్ణు పుష్కరిణిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ప్రారంభించారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఆదివారం విష్ణు పుష్కరిణిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని చెప్పారు. స్వామివారి వద్ద సంకల్ప పూజ చేశారు. అనంతరం స్వామి వారి అఖండ దీపాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.