టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

దసరా పండుగ నేపథ్యంలో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతున్నది.

Update: 2024-10-14 15:35 GMT

దిశ,చౌటుప్పల్: దసరా పండుగ నేపథ్యంలో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతున్నది. బతుకమ్మ, దసరా ఉత్సవాలు ముగియడంతో పల్లెలకు తరలిన ప్రజలు హైదరాబాద్‌ బాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని పంతంగి టోల్ ప్లాజా తో పాటు చౌటుప్పల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు హైదరాబాద్ వైపు వెళ్లే వాహన లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ ను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.


Similar News