సన్న బియ్యంతో పేదింట్లో సంతోషం : ఎమ్మెల్యే మందుల సామేల్

రేషన్ దుకాణాల్లో ఇస్తున్న సన్న బియ్యంతో పేదింట్లో సంతోషం వ్యక్తం

Update: 2025-04-01 10:44 GMT

దిశ,నూతనకల్ : రేషన్ దుకాణాల్లో ఇస్తున్న సన్న బియ్యంతో పేదింట్లో సంతోషం వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో జహంగీర్ నిర్వహిస్తున్న రేషన్ షాప్ 5 లో ఎమ్మెల్యే మందుల సామేల్ సన్నబియ్యాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మండలంలో ప్రస్తుతం ఉన్న 10701 ఆహార భద్రత కార్డుదారులకు 1965 క్వింటాల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ ,తదితర నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

Similar News