చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే

కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్, కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. నిర్వహించే కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు

Update: 2024-10-15 11:52 GMT

దిశ ,నకిరేకల్ : కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. నిర్వహించే కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తరలించుకొని గిట్టుబాటు ధరను పొందాలని సూచించార. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కల్లాల వద్ద ధాన్యం నిల్వ ఉంచకూడదన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి 2300 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అదేవిధంగా సన్నాలకు 500 రూపాయలను అధికంగా బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి మాసం నుంచి రేషన్ దుకాణాలతో ప్రజలకు సన్న బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రతినిత్యం నిర్వాహకులు కేంద్రాలను పరిశీలించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు సైతం ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట్ రెడ్డి, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News