చెత్త సేకరణ ఇలా?

ట్రాక్టర్ తో చెత్త సేకరించడంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Update: 2024-10-27 15:56 GMT

దిశ,కనగల్లు: ట్రాక్టర్ తో చెత్త సేకరించడంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండలంలోని ధర్వేశిపురం గ్రామ పరిధిలో మంచి నీళ్ళ బావి, ఎల్లమ్మ గూడెం, గ్రామంలో చెత్త సేకరణకు రాకపోవడంతో..స్థానికులు తీవ్ర ఇబ్బందుులు పడుతున్నారు. అలాగే ట్రాక్టర్లులో చెత్త వేయడానికి సిబ్బంది లేకపోవడంతో మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. దీంతో స్థానికులు ట్రాక్టర్ లో చెత్త వేయడం మానేశారు. ట్రాక్టర్ ట్రక్కులో చెత్త తీసుకోవడానికి ఒకరిని ఉంచాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన .. పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ట్రాక్టర్ వద్ద కుర్చీ సహాయంతో చెత్తను ట్రాక్టర్ లో పోస్తున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు.


Similar News