పోలీసుల కస్టడీకి మాజీ తహశీల్దార్ జయశ్రీ
ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ తహసీల్దార్ వజ్రాల జయశ్రీ సబ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
దిశ , హుజూర్ నగర్ : ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ తహసీల్దార్ వజ్రాల జయశ్రీ సబ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ షకీల్ అహ్మద్ అన్సారి తెలిపిన వివరాల ప్రకారం..తహశీల్దార్ జయశ్రీ ని తదుపరి విచారణ కొరకు పోలీస్ కస్టడీకి అనుమతించమని స్థానిక సీఐ చరమందరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ఒకరోజు కస్టడీకి అనుమతించారు. తిరిగి సోమవారం సీఐ చరమందరాజు తహశీల్దార్ ను మూడు రోజుల కస్టడీకి కి ఇవ్వమని కోరుతూ.. హుజూర్ నగర్ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున కోదాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జయశ్రీ ని మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ..ఆదేశాలు జారీ చేశారు. కాగా జయశ్రీ కి బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు