పార్టీ మార్పు అసత్య ప్రచారం.. మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి..

నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తానూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళుతున్నామనే ప్రచారమంతా అసత్యమని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.

Update: 2023-04-29 11:03 GMT

దిశ, చిలుకూరు : నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తానూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళుతున్నామనే ప్రచారమంతా అసత్యమని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశారు. కావాలని కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రచారానికి తెర లేపారన్నారు.

రాబోయే ఎన్నికల్లో తమను ఎదిరించే ధైర్యం లేక ఇలాంటి చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారని పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమన్నారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, తాము కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News