పోటాపోటీగా మండలాల్లో నేతల ‘ఆర్థిక సాయం’.. ఎన్నికల దాకా గుర్తుండని ఆసరా
‘సాయం’ పేర ప్రతి నెలా సుమారు రూ.రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా, మండలస్థాయి లీడర్లతోపాటు గల్లీ లెవల్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో కార్యకర్తల
‘సాయం’ పేర ప్రతి నెలా సుమారు రూ.రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా, మండలస్థాయి లీడర్లతోపాటు గల్లీ లెవల్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో కార్యకర్తల కుటుంబంలో ఎవరైనా చచ్చినా, పుట్టినా, ఇంకేదైనా ఫంక్షన్ చేసినా ఖర్చుల నిమిత్తం సాయం పేర తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఒక్క మర్రిగూడ మండలంలో మినహా ప్రతీ మండలాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మండల స్థాయి లీడర్లు కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కార్యకర్తల్లో కుటుంబాల్లో జరిగే శుభ, అశుభకార్యాలకు హాజరవుతూ సుమారు రెండు వేల నుంచి రూ.20వేల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. వీటికి తోడు ఎన్నికల సమయంలో సైతం డబ్బు ఖర్చు చేయక తప్పదని ఆవేదన చెందుతున్నారు మండలస్థాయి నేతలు. చేసిన ‘సాయాన్ని’ గుర్తుపెట్టుకుని తమకు ఓటు వేస్తారో?లేదోననే ఆందోళనా పలువురు లీడర్లలో లేకపోలేదంటూ నియోజకవర్గ వాసులు చర్చించుకుంటున్నారు. ఎక్కడ తన మైలేజ్ పడిపోతుందోనని ఆర్థిక సాయం పంపిణీలో పలువురు నాయకులు పోటీ పడుతూ ఆర్థికంగా నలుగుతున్నారు.
దిశ, మర్రిగూడ : అధికార, ప్రతిపక్ష పార్టీల మండల స్థాయి లీడర్లు కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గ్రామాల్లో కార్యకర్తల్లో కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు అశుభ కార్యక్రమాలకు రూ.ఐదువేల నుంచి పదివేల వరకు ఇస్తూ ఒక్కొక్క లీడర్ నెలకు సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంత చేసినా తీరా ఎన్నికల సమయంలో ఆర్థికంగా ఆదుకున్న కుటుంబాలు ఏమైనా గుర్తుంచుకుంటారా అనే ఆవేదన ఖర్చు చేసిన లీడర్ లో నెలకొని ఉంది . గ్రామాల్లో కార్యకర్తలను ఆపద సమయంలో ఆదుకోవడానికి మనోధైర్యాన్ని ఇచ్చే మండల స్థాయి జిల్లాస్థాయి లీడర్ల జేబులకు చిల్లులు పడుతున్న కిందిస్థాయి కార్యకర్తల ఫోన్లకు ఖర్చు చేయక తప్పడం లేదని మనోవేదనకు గురవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మర్రిగూడ మండలం తప్ప మిగతా అన్ని మండలాల్లో ఎంపీపీలు, జెడ్పిటిసిలు కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు గ్రామాల్లో జరిగే అశుభ కార్యక్రమాలకు రూ.5000 నుంచి పదివేల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులు కార్యకర్తల ఆపదలకు అక్కరకు రాకపోయినా మండల స్థాయి వ్యక్తులు విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ కార్యకర్తలను మచ్చిక చేసుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అధికార పార్టీ చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీలు బారసాల, పెండ్లిలు, ఆసుపత్రికి ఖర్చులు, పుట్టినరోజులకు చావులకు అంత్యక్రియలకు రూ.10 పదివేల వరకు ఆర్థిక సాయం చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీల లీడర్లు రూ.ఐదు వేల నుంచి రూ.పదివేల అందజేస్తున్నారు. ఐదేళ్లుగా కార్యకర్తల ఆపదలకు ఖర్చు చేసుకుంటూ వెళ్లిన లీడర్లుకు కొత్త లీడర్ల ప్రవేశంతో రూ.పదివేల కంటే ఎక్కువ ఆర్థిక సాయం అందజేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల నుంచి ఫోన్లు వస్తేనే భయపడే స్థాయికి లీడర్లు చేరుకుంటున్నారంటే ఏ మేరకు గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాలకు అందజేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నెలకు సుమారుగా ఒక్కొక్క లీడర్ రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్నా ఎన్నికల సమయం అప్పుడు కార్యకర్తలకు ఏమైనా గుర్తుంటారంటే అది కూడా ఉండదేమోనని మనోవేదనకు గురవుతున్నారు.
ఆసరా.. లీడర్ల జేబులకు చిల్లులు
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై కన్నేసిన మండల, జిల్లాస్థాయి నాయకులు గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలు, అశుభ కార్యక్రమాలకు రూ. రెండు నుంచి రూ. 10వేల వరకు నగదు ఇస్తూ వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్న మండల జిల్లా, నాయకులతోపాటు ఎంపీపీలు, జెడ్పిటిసిలు కార్యకర్తల కుటుంబాల శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఆర్థిక ప్రోత్సాహాలను అందజేస్తున్నారు. మర్రిగూడ మండలంలో ఎంపీపీ, జడ్పిటిసిలు తప్ప నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలతో పాటు ఎమ్మెల్యే ఆస్పరెంట్లు శుభకార్యలకు అశుభ కార్యాలకు రూ.2000 నుంచి 20వేల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అందజేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం కార్యకర్తల కుటుంబాలకు ఎంతో కొంత నగదును అందజేస్తున్నారు. ఎక్కడ తన మైలేజ్ పడిపోతుందోనని ఆర్థిక పంపిణీలో నాయకులు పోటీ పడుతూ ఆర్థికంగా నలుగుతున్నారు.
చచ్చినా.. పుట్టినా.. ఫంక్షన్ చేసినా తప్పని సాయం
గ్రామాల్లో ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు రాజధానిలో ఉండే లీడర్లకు ఫోన్లు చేసి ఫలానా వారి ఇంట్లో వారి ఇంటి పెద్దదిక్కు కోల్పోయాడు. మనం తప్పనిసరిగా హాజరై రూ.10వేలు ఆర్థిక సాయం అంత్యక్రియల ఖర్చులకు ఇవ్వాలని పేర్కొనడంతో ఆ లీడర్ గూగుల్ పేనో, ఫోన్ పేనో చేయించుకుని ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలా ప్రతి చిన్న కార్యక్రమం నుంచి హాస్పిటల్ కు అయ్యే ఖర్చుల వరకు లీడర్లతో కార్యకర్తలు అందజేయిస్తున్నారు. ఆసుపత్రిలో అయ్యే ఖర్చులకు ప్రభుత్వం నుంచి వచ్చే సీఎంఆర్ఎఫ్ తో పాటు చేతి ఖర్చులకు రూ.10 నుంచి రూ.20వేల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. అధికారపక్షం వాళ్లు ఫలానా వ్యక్తి కుటుంబానికి రూ.20వేలు ఇచ్చారు. కనీసం మనం రూ. పదివేలైనా ఇస్తే ఆ కుటుంబాలు మన పార్టీకి సపోర్టుగా ఉంటారని కార్యకర్తలు చెప్పడంతో తప్పనిసరిగా లీడర్లు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఒక్కో లీడర్ సుమారుగా నెల పేర రూ.రెండు లక్షల వరకు ఆర్థిక సాయాల పేరిట ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
ఎన్నికల దాకా గుర్తుండని సాయం
ఐదు, పదేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతి కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నా ఎన్నికల సమయమప్పుడు గుర్తుంచుకుంటారో, లేదోనని ఓ ప్రజాప్రతినిధి మనోవేదనకు గురైతున్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పోస్టర్లు, గోడలపై రాతలు రాయిస్తూ ముందుకు సాగుతూ ఉండడంతో ఆర్థికంగా చతికిల పడిన మండలస్థాయి నాయకులు దిగాలు చెందుతున్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఖర్చు చేసి ప్రతి దానికి నేనున్నా అనే భరోసా కల్పించిన ఆ కుటుంబాలైనా తమను గుర్తించుకుంటారో, లేదో అని ఖర్చు చేసిన లీడర్లు ఆవేదన చెందుతున్నారు.