ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తా

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

Update: 2024-09-11 13:35 GMT

దిశ, మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం ఉన్నత పాఠశాలలో 14, 17 సంవత్సరాల లోపు విద్యార్థులకు క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలన్నదే తన అభిమతం అన్నారు.

    క్రీడలలో తెలంగాణను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు కలలను సాకారం చేసుకోవాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకుపోగా తక్షణ సహాయంగా 10 వేల నగదు అందజేశారు. మిగతా సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు తీపి రెడ్డి గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత లక్ష్మి నరసింహారెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మీ నరసింహ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి, అవిలుమల్లు సుదర్శన్, స్థానిక నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News