తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశం..
రాబోయే వేసవి కాలంలో నకిరేకల్ ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు.
దిశ, నకిరేకల్ : రాబోయే వేసవి కాలంలో నకిరేకల్ ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రాంట్ల నుండి మున్సిపాలిటీకి 48 కోట్లు మంజూరయ్యాయని అందులో 25 కోట్లు అమృత్ పథకం ద్వారా వచ్చాయన్నారు. పట్టణంలో రాజీవ్ యువ వికాసానికి 300 మంది యువకులను ఎంపిక చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పునరావృతం చేస్తామని తెలిపారు. ఆర్ అండ్ బీ మార్కెట్ స్థలాలను మున్సిపాలిటీకి ఇవ్వాలని సూచించారు. ఉగాది నాటి నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతతో పని చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉమారాణి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.