ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు
కేసీఆర్ 24 గంటల కరెంటు బోగస్ అని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
దిశ, కనగల్లు: కేసీఆర్ 24 గంటల కరెంటు బోగస్ అని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం కనగల్లు మండలంలో ఉచిత విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇంటిని నిర్మించి పేదలకు పంచలేదని ఒక్క రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తున్నాం, మరో వారంలో ఐదు గ్యారంటీ అమలు చేయబోతున్నాం అని అన్నారు. ఇప్పటికే 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం, మెగా డీఎస్సీ ఇవ్వడం జరిగిందని అన్నారు. 200 లోపు యూనిట్లు వాడుకునే పేదలందరికీ జీరో బిల్లులు ఇచ్చి మా పరిపాలన సమర్థతను నిరూపించుకున్నామని అన్నారు. రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీటి, కష్టాలు లేకుండా చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జాతి పథకం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న కష్టాలను మంత్రి వద్ద ఏకరువు పెట్టుకున్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడుకున్న అర్హులైన పేదవారికి విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని, రూ. 500 ఎల్పీజీ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. రూ. 2000 కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేస్తామని తొమ్మిదిన్నర కిలోమీటర్లు నెల రోజుల్లో మొదలు పెడతామని అన్నారు.
ఏఎన్నార్ కాలువ పొనుగోడు పైడిమర్రి కాలువ లైనింగ్ సిమెంట్‌తె రూ. 500 కోట్లతో పూర్తి చేస్తామని డీ 25, డీ 22 గుండ్లపల్లి, నర్సింగ్ పట్ల, కాలువలను పూర్తి చేశాం అన్నారు. ధర్వేశిపురం నుండి తేలకంటి గూడెం వరకు రూ. 500 కోట్లతో సిమెంట్ రోడ్డు వేస్తామని పగిడిమర్రి వద్ద బ్రిడ్జి నిర్మిస్తామని, పొనుగోడు రామచంద్రపురం రోడ్డు పూర్తి చేస్తామని కనగల్లు ఎక్స్ రోడ్డు నుండి మల్లేపల్లి వరకు రూ. 500 కోట్లతో బీటీ రోడ్డు వేస్తామని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, చూసైనా నేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డ అనూప్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి, నర్సింగ్ కృష్ణయ్య గౌడ్, మే శివయ్య, పోలే విజయ్ కుమార్, నకిరేకంటి యాదగిరి గౌడ్, చీదేటి వెంకటరెడ్డి, రాయల్ శేఖర్, తోలుగాల అనూష, రాయల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.