ఈ రోజు నుంచి డిజిటల్ కార్డు సర్వే.. నియోజకవర్గానికి ఐదు సర్వే టీములు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది.

Update: 2024-10-03 02:45 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామం, మున్సిపాలిటీలోని ఒక వార్డును పూర్తిస్థాయిలో సర్వే చేయనున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను మున్సిపల్ వార్డులను ఎంపిక చేసి సర్వే చేయనున్నారు.

నేటి నుంచి డిజిటల్ కార్డు సర్వే..

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను మున్సిపల్ వార్డులను ఎంపిక చేసుకొని అక్టోబర్ 3 నుంచి 7 తేదీ వరకు సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ప్రతి నియోజకవర్గానికి ఐదు టీములు పనిచేయనున్నాయి. ఆ టీంలలో మున్సిపల్ కమిషనర్లు ఎమ్మార్వోలు , ఎంపీడీవోలు ఉన్నారు. వారితోపాటు స్థానిక అధికారులు కూడా టీమ్‌లలో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ సర్వే జరుగుతున్న క్రమంలో పర్యవేక్షణ చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క డివిజనల్, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించారు.

ఇందులో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సూర్యాపేట ఆర్డీవో, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డివో హుజూర్నగర్ నియోజకవర్గానికి హుజూర్నగర్ ఆర్డిఓ, భువనగిరి నియోజకవర్గానికి భువనగిరి ఆర్డీవో అమరేందర్, ఆలేరు నియోజకవర్గానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇన్చార్జిగా నియమించారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గానికి జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, నల్గొండకు ఆర్డీవో శ్రీదేవి దేవరకొండకు, ఆర్డీవో శ్రీరాములు సాగర్ , హాజింగ్ పిడి రాజ్ కుమార్, మునుగోడు కు చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ విత్ లను ఇంచార్జిలు నియమించారు.

డిజిటల్ కార్డు సర్వే గ్రామాలు వార్డులు ఇవే..

డిజిటల్ కార్డు సర్వేకు మూడు జిల్లాల అధికారులు ఆయా నియోజకవర్గాలలో గ్రామాలను మున్సిపల్ వార్డులను ఎంపిక చేశారు. వాటిలో.. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు, కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామం, నల్గొండ నియోజకవర్గంలోని నల్లగొండ మున్సిపాలిటీలో నాలుగో వార్డు, తిప్పర్తి మండలం గంగన్న పాలెం, మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీలో మూడో వార్డు, మునుగోడు మండలంలోని జమాస్థాన్ పల్లి, దేవరకొండ నియోజకవర్గం లోని దేవరకొండ మునిసిపాలిటీలో 20వ వార్డు, చందంపేట మండలంలోని అచ్చంపేట పట్టి , నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపాలిటీలో 11వ వార్డు, త్రిపురారం మండలంలోని కొంతలపల్లి , మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ మున్సిపాలిటీలో 23 వ వార్డు, మండలంలోని రుద్రవరం గ్రామాన్ని ఎంపిక చేశారు

సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ మున్సిపాలిటీలో నాలుగో వార్డు పాలకీడు మండలంలో రాజుపాలెం, సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట పట్టణంలో 37 వార్డు పెన్పహాడ్ మండలంలో నాగుల పాటి అన్నారం, తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండలం రామచంద్రపురం, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డు, కోదాడ నియోజకవర్గంలోని కోదాడ మున్సిపాలిటీలో 30వ వార్డు, అనంతగిరి మండలంలో వసంతపురం గ్రామ పంచాయతీ లను ఎంపిక చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు, మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం, భువనగిరి నియోజకవర్గం లోని భువనగిరి మున్సిపాలిటీలో 15 వ వార్డు, బీబీనగర్ మండలంలోని మహదేవపూర్ గ్రామాలను ఎంపిక చేశారు....


Similar News