అతిసార తీవ్రత దృశ్య శరవేగంగా పారిశుద్ధ్య పనులు

చింతలపాలెం మండల కేంద్రంలో పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Update: 2024-10-23 14:29 GMT

దిశ చింతలపాలెం :- చింతలపాలెం మండల కేంద్రంలో పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా గ్రామంలో అతిసార విజృంభిస్తుండడంతో.. జిల్లా వైద్యా అధికారులు గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈ క్రమంలో పంచాయితీ రాజ్ అధికారులు మండల కేంద్రంలోని పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం గ్రామంలో పలు వీధుల్లో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్త తొలగించారు, రోడ్ల వెంట బ్లీచింగ్ చల్లి, శానిటేషన్ చేశారు. ఎంఈఓ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ వద్ద మట్టి తరలించి.. పిచ్చి మొక్కలను జేసిబి ద్వారా తొలగించి స్థలం శుభ్రం చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను ఎంపీడీవో భూపాల్ రెడ్డి బుధవారం సందర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి డయేరియా కేసుల వివరాలు తెలుసుకున్నారు. అతిసార నియంత్రించే వరకు వైద్యులకు సహకారం అందిస్తామని తెలిపారు. వైద్య సిబ్బందితో పాటు శానిటేషన్ పనుల కోసం గ్రామపంచాయతీ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. కాగా బుధవారం 4 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరిని హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేశారు. 30 మంది వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాగా వైద్య శిబిరంలో సెలెన్ బాటిల్ లు, ఇంజెక్షన్ లు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి అసత్య ప్రచారాలు నమ్మకుండా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సచిన్ అన్నారు.


Similar News