ముగిసిన ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

Update: 2024-06-18 06:27 GMT

దిశ, కనగల్లు: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అంతకుముందు ఉదయం ఆలయంలో గవ్వంత పూజలు, 108 కలశాలతో అష్టోత్తర, శతఘటాభిషేకాలు, నీరాజనం మంత్రపుష్ప, అమ్మవారికి సత్యాన్న బోనం, రేణుక ఎల్లమ్మ లందగోలంలకు పోవు పూజలను ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యులు అర్చక బృందం నిర్వహించింది. చివరి రోజున సోమవారం ధర్వేశిపురం, పర్వతగిరి, గ్రామస్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు ఆయా గ్రామాల నుంచి కాలినడకన ఆలయం వద్దకు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించారు.

ఈ కార్యక్రమాల్లో ఉత్సాహ కమిటీ చైర్మన్ చెనగోని నగేష్ గౌడ్, డైరెక్టర్లు నకిరేకంటి యాదగిరి గౌడ్, రాయల వెంకన్న, నీలకంఠం యాదగిరి, జినుకుంట్ల కృష్ణయ్య, తోలుగాల రాములు, కంచరకుంట్ల శివారెడ్డి,ఎల్లయ్య, ఆలయ సిబ్బంది ఈవో జె. జయరామయ్య, జినుకుంట్ల చంద్రయ్య, చిలుక రాజు లింగయ్య, సిహెచ్.లింగస్వామి, కూసం ఉపేందర్ రెడ్డి, ఎన్.ఆంజనేయులు, జినుకుంట నాగరాజు, చెనగోని శ్రీకర్, వెంకటయ్య, నాయకులు ఎంపీటీసీ నకిరేకంటి శైలజ సైదులు గౌడ్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, జినుకుంట్ల సోమయ్య, దేప కరుణాకర్ రెడ్డి, జినుకుంట్ల లింగయ్య గౌడ్, భైరి నగేష్, జినుకుంట్ల ఆంజనేయులు, రాయల శేఖర్, పాలకూరి సైదులు, కడమంచి ఎల్లయ్య, యాదగిరి, రామచంద్రు, చింత సైదులు, నల్లబోతు శ్రీనివాస్, గణేష్ తదితరులు ఉన్నారు.


Similar News