ఉమ్మడి నల్గొండలో 12 స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు : MP Uttam Kumar Reddy

రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్న నిరుద్యోగ యువత బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2023-08-23 16:49 GMT
ఉమ్మడి నల్గొండలో 12 స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు : MP Uttam Kumar Reddy
  • whatsapp icon

దిశ,కోదాడ: రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్న నిరుద్యోగ యువత బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం అయిన ముదిరాజ్ కులానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమని, ముదిరాజులు బీఆర్‌ఎస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 12% ఉన్న ముస్లింలకు 3 టిక్కెట్లు కేటాయించి అవమానపరిచారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 70 స్థానాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలవడం ఖాయమన్నారు. Congress won 12 seats in combined Nalgonda: MP Uttam Kumar Reddyఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా ఉన్నాయని ఆరోపించారు. గుడిబండ గ్రామంలో దళిత బంధు పథకంలో 70 శాతం అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. ప్రజలందరి కోరిక మేరకే హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి నేను, కోదాడ నియోజకవర్గం నుండి పద్మావతి రెడ్డి పోటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News