కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీలో వణుకు : రామాంజనేయులు గౌడ్
హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు వెచ్చేసిన తెలంగాణ ప్రజలను చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వణుకు పుట్టిందని భువనగిరి నియోజకవర్గం ఇంచార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్ అన్నారు.
దిశ, వలిగొండ : హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు వెచ్చేసిన తెలంగాణ ప్రజలను చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వణుకు పుట్టిందని భువనగిరి నియోజకవర్గం ఇంచార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్ అన్నారు. సోమవారం వలిగొండ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయభేరి సభకు భువనగిరి నియోజకవర్గం నుండి 500 పై చిలుకు వాహనాలలొ 25 వేల మంది బయలుదేరినారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత పదిసంవత్సరాలు పాలించి అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, అనేకమైన హామీలు ఇచ్చి గద్దెనెకి లక్షలాది కోట్ల రూపాయలు కూడా గట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నాడు అని ప్రజలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుండి తరిమేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవడానికి యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, 6 గ్యారంటీ హామీలను, ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనినమ్ముతున్నారని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, విజయం సాధించి దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడి స్థానిక రేణుకా దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పెద్దబోయిన నరసింహ, బుంగ మాట్ల నరసింహలను పరామర్శించి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు అందజేశారు. అదేవిధంగా స్థానిక కంటమహేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దలు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, బడుగు సత్యనారాయణ, కందాల రామకృష్ణారెడ్డి, వాకిటి అనంతరెడ్డి, పబ్బు శ్రీనివాస్ గౌడ్, బద్ధం సంజీవరెడ్డి, ఎంపీటీసీ గూడూరు వెంకట్ రెడ్డి, పంజాల రమేష్ గౌడ్, చిలుగురి సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.