ఆలేరులో కాంగ్రెస్ ప్రభంజనం
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునితా మహేందర్ రెడ్డిపై బీర్ల అయిలయ్య 48,656 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునితా మహేందర్ రెడ్డిపై బీర్ల అయిలయ్య 48,656 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రధానంగా బీర్ల అయిలయ్య గెలుపునకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వేవ్ రావడంతో గెలుపు సునాయాసం అయింది. కరోనా సమయంలో ఆలేరు నియోజకవర్గ అన్ని మండలాల్లో ప్రజలను ఆదుకోవడంలో బీర్ల ఐలయ్య ప్రత్యేక చొరవ చూపించారు. ఆ సమయంలో పారిశుద్ధ, ఆశ, వైద్య ,అత్యవసర కార్మికులు, ప్రజలకు వివిధ రంగాల ఉద్యోగులకు అండగా నిలబడి తన వంతు సహాయంగా బియ్యం, కూరగాయలు ఇంటింటికి అందజేయడంతో మంచి పేరును సంపాదించుకున్నారు. అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్లు, రోడ్డు బాధితులు, భూ నిర్వాసితుల సహకారం ఐలయ్య గెలుపునకు కలిసి వచ్చింది.
ఇక గొంగిడి సునితామహేందర్ రెడ్డి ఒటమికి ప్రధాన కారణం ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత కారణమైంది. దీంతో పాటుగా పలువురు ఉద్యమ నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడడం సైతం కారణమైంది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భూములు ఇంట్లో కోల్పోయిన బాధితులు, బస్వాపురం ప్రాజెక్టులోని భూ నిర్వాసితుల నుంచి కూడ వ్యతిరేకత పెరిగింది.