రోడ్డెక్కిన రైతున్న..ఐకేపీలో కొనుగోళ్లలో జాప్యంపై ఆందోళన
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారంటూ అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పాలకవీడు మండలంలోని శూన్య
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారంటూ అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం పోసిన రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాన్ పహడ్-దామరచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేంద్రాల్లో సరైన సమయానికి అధికారులు కాంటాలు వేయడం లేదని, కాంటాలు వేసిన బస్తాలను మిల్లలకు తరలించేందుకు లారీలు సక్రమంగా సరఫరా చేయడం లేదని వాపోయారు.
మిల్లుకు పంపించిన బస్తాలను కూడా మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా ధాన్యం నాణ్యతగా లేదని సాకుతో అధికంగా తరుగు తీస్తు రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని ఆందోళనకు దిగారు. తాము పండించిన ధాన్యం అమ్ముకోవలంటే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షంతో ఐకేపీలో పోసిన ధాన్యంపై కప్పిన పట్టాలు లేచిపోయి ధాన్యం తడుస్తున్నాయని, వాటిని కాపాడేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సైదులు తహశీల్దార్ శ్రీదేవి ఐకేపీ అధికారులతో కాంటాలు ఎందుకు వేయడం లేదని సంప్రదింపులు జరిపారు. అలాగే సివిల్ సప్లై డీటీ రాజశేఖర్ అక్కడికి చేరుకొని రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు అందించాలని, అలాకాకుండా తాలు శాతం మ్యాచర్ కండిషన్ అధికంగా ఉండడం వల్ల మిల్లర్లు ఆ ధాన్యం తీసుకోవడం లేదని, ఇలా చేయడం వల్ల ఒక బస్తాకు రెండు మూడు కిలోల తరుగు పోతుందని భావించిన మిల్లర్లు రైతుల బస్తాల నుంచే వాటిని కట్ చేస్తున్నారని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని అందిస్తే తరుగు లేకుండా మిల్లర్లతో మాట్లాడి దిగుమతి చేయిస్తామని అన్నారు. ప్రస్తుతం వర్షాలు ప్రభావం ఉన్నందున నాలుగు ఐదు రోజుల్లో కాంటాలను వేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.