ఫంక్షన్ హాల్‌గా నందికొండ మున్సిపాలిటీ కార్యాలయం
మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ల అతి ఉత్సాహమో గాని నందికొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని, చైర్ పర్సన్ ఛాంబర్‌ను ఫంక్షన్ హాల్ గా మార్చిన సంఘటన బుధవారం నాగార్జునసాగర్‌లో చోటుచేసుకుంది.
దిశ, నాగార్జునసాగర్: మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ల అతి ఉత్సాహమో గాని నందికొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని, చైర్ పర్సన్ ఛాంబర్‌ను ఫంక్షన్ హాల్ గా మార్చిన సంఘటన బుధవారం నాగార్జునసాగర్‌లో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ ఏడవ వార్డు కౌన్సిలర్ నిమ్మల ఇందిరా జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలోని చైర్పర్సన్ ప్రత్యేక ఛాంబర్‌లో కౌన్సిలర్ నిమ్మల ఇందిరా జన్మదినోత్సవాన్ని మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, చైర్ పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా కేటును కేకు కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుంటూ ఫంక్షన్ హాలును తలదన్నే రీతిలో వేడుక జరుపుకున్నారు. కాగా బుధవారం నాడు నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్యుల సాధారణ సమావేశం నిర్వహిస్తున్నామని ఒకరోజు ముందుగానే ప్రకటనల ద్వారా తెలియజేసిన కమిషనర్ మీడియాని మాత్రం అనుమతించకుండా మేము సమావేశం చేసుకుంటున్నాము మీకు అనుమతి లేదని చెప్పడం గమనించదగినది. నందికొండ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం పేరుతో ఓ కౌన్సిలర్ జన్మదిన వేడుకలను చైర్పర్సన్ ఛాంబర్‌లో నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.