వచ్చేసారి మంత్రి కానున్న బీర్ల ఐలయ్య : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కనుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-03-06 13:53 GMT

దిశ, రాజాపేట: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కనుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మొదటిసారిగా రాజాపేటకు విచ్చేసి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడిన అనంతరం పలువురు మంత్రికి శాలువా పూలమాలతో సత్కరించిన సమయంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సన్మానం వద్దని ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న బీర్ల ఐలయ్య వచ్చేసారి మంత్రి కానున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమిత మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సిల్వర్ బాలరాజు గౌడ్, నమిత కేదారి, రాజాపేట అధ్యక్షులు ఐరేని నవీన్ కుమార్, చంద్రారెడ్డి, గౌరభక్కులు, నాగిర్తి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News