BIG Alert: యాదాద్రి జిల్లా వాసులకు బిగ్ అలర్ట్.. మాన్యువల్‌గానే కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన

నూతన రేషన్ కార్డుల కోసం మీసేవ నుంచి దరఖాస్తు చేయాలని సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2025-02-08 04:31 GMT
BIG Alert: యాదాద్రి జిల్లా వాసులకు బిగ్ అలర్ట్.. మాన్యువల్‌గానే కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన
  • whatsapp icon

దిశ, యాదాద్రి కలెక్టరేట్: నూతన రేషన్ కార్డుల కోసం మీసేవ నుంచి దరఖాస్తు చేయాలని సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన మాన్యువల్ దరఖాస్తులను కూడా పరిశీలించి, ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ ఆహార భద్రత కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. మీసేవలో దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టి సర్వీసును వెంటనే తొలగించారు. డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీసేవా కేంద్రాల ద్వారా మరోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసినట్లు యాదాద్రి భువనగిరి మీసేవా జిల్లా మేనేజర్ సాయి కుమార్ తెలిపారు.

Tags:    

Similar News